పల్నాడు జిల్లా, కారంపూడి : శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కారంపూడి మండలం ఇనుపరాజు పల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మూతపడిందని గ్రామస్తులు ఫ్యాక్టరీ గేటు ముందు బైఠాయించారు. ఫ్యాక్టరీ దగ్గరలోని స్వామివారి దేవస్థానం సంబంధించిన సుమారు ఆరు ఎకరాల భూమిని ఉందని దానిని ఫ్యాక్టరీ యాజమాన్యం కౌలుకు తీసుకోకుండా మరియు కొనుగోలు చేయకుండా నిర్వీర్యం చేసిందని గ్రామస్తులు ఆరోపించారు గతంలో గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఆ భూమికి వేలంపాట నిర్వహించి వచ్చే సొమ్ముతో స్వామివారి దూపదీప నైవేద్యాలు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ చుట్టుపక్కల దుమ్ముదులి ఉండటం అడ్డదిడ్డంగా దారులు ఏర్పాటు చేయటంతో ఆ భూమిని ఎవరు కౌలుకు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని దీంతో స్వామివారి దీపధూప నైవేద్యాలకు డబ్బులు లేక పూజారికి సైతం జీతాలు ఇవ్వలేకపోవడంతో గుడి మూసివేయడం జరిగిందన్నారు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలా లేవని ఇప్పటికైనా ఫ్యాక్టరీ యజమాన్యం కలగజేసుకొని స్వామివారి గుడికి అయ్యే ఖర్చును భరించి స్వామివారి దేవస్థానంను తెరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు