contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Palnadu : పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పల్నాడు జిల్లా, నరసరావుపేట : అమరవీరుల సంస్మరణ దినం 2024 నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా, ఈ రోజు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీసు విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉపయోగించే సాధనాల ప్రదర్శన జరిగింది.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఓపెన్ హౌస్ (Open House) కార్యక్రమ నిర్వహించడం ద్వారా సమాజ శ్రేయస్సు కొరకు పోలీస్ వారు నిర్వర్తించే విధులు గురించి విద్యార్థిని,విద్యార్థులు అవగాహన తో ప్రేరణ పొంది, భవిష్యత్తులో యువత పోలీస్ శాఖ మరియు ఇతర భారత బలగాల లో సేవలందించడానికి ముందుకు రావడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

విచ్చేసిన వివిధ పాఠశాలల , కళాశాలల విద్యార్థులకు ఆయుధాల పనితీరు సాంకేతిక పరికరాల ఉపయోగాలును అధికారులు వివరించారు.

ఈ  కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీ ,వెల్ఫేర్ ఆర్.ఐ. గోపినాథ్, ఆర్.ఐ యువరాజ, ఆర్.ఐ కృష్ణ, ఆర్.ఐ. రాజా పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :