పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం, స్థానిక దాతల తోడ్పాటుతో సమకూర్చిన 2.40 కోట్ల నిధులతో పాత సమితి స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణ పనులను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమల్ల రమేష్ కూటమి నేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆలయ నిర్మాణ కమిటీకి సూచించారు.
ఈ కార్యక్రమంలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ రామ్ గోపాల్ రావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ వడ్లమూడి అప్పారావు, మాజీ ఎంపీపీ గల్లా బాబురావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మక్కెన సాగర్, 75 తాళ్లూరు తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు