ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా దినపత్రికలలో వస్తున్న ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ఎన్నికల నోడల్ అధికారులు ,మున్సిపల్ కమిషనర్లు మండల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో బహిరంగ ప్రదేశాలలో రాజకీయ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలపై ఉన్న పోస్టులను తొలగించేయాలని ఆదేశించారు. సి విజిల్ యాప్ పెర్ఫార్మెన్స్ ను పరిశీలించారు. సి విజిల్ యాప్ లో వస్తున్న సమస్యలను పరిష్కరించాలని, సమస్యలు ఏమైనా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న వివిధ రకాల ఫార్మ్ ల క్లైములను సకాలంలో పరిష్కరించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశాలలో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీ ములకు జిపిఎస్ అనుసంధానం జరిగిందని వివరించారు . అదేవిధంగా చెక్ పోస్ట్ ల వద్ద సీసీ కెమెరాలు అనుసంధానం చేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..
