పల్నాడు జిల్లా ,పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని శనివారం నియోజకవర్గ కేంద్రం పెద్దకూరపాడులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెద్దకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్థిమళ్ల రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నుపాటి బుల్లిబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.. తెలుగుజాతి యుగ పురుషుడు ఎన్టీఆర్ అని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రమేష్ అన్నారు… నేతలతో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మాగులూరి భాను ప్రకాష్, మాజీ ఎంపీపీ బెల్లంకొండ రామ్ గోపాల్ రావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వడ్లమూడి అప్పారావు, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి భాష్యం ఆంజనేయులు, నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్, వైస్ ఎంపీపీ చాంద్ బాష, బీసీ నాయకులు మోదుగుల చంద్రం, కోరంపల్లి నరేంద్ర, కోరంపల్లి వెంకటరామయ్య, ఎస్సీ సెల్ నాయకులు పాటిబండ్ల బాలయ్య, , వేమవరపు రాజారావు, పాటిబండ్ల యోహాను , జంగాల ప్రసాద్ , మైనార్టీ నాయకులు మిలిటరీ మౌలాలి, మస్తాన్ షరీఫ్, మలాట్ రఫీ, పర్వేజ్, తెలుగు యువత అధ్యక్షులు మక్కెన సాగర్, యువ నాయకుడు నెల్లూరి మల్లికార్జున్ తెలుగు యువత మండల అధ్యక్షులు గళ్ళ శివ కార్యనిర్వాహక కార్యదర్శి ముంతాజ్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సరిపూడి కృష్ణకుమారి, తెలుగు మహిళలు కొండ్రు పద్మలత, నాదెండ్ల కల్పన తదితరులు పాల్గొని.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు… అన్నదానం చేపట్టారు.
