contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం నెమలిపురి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. లారీ కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీయా, ఆమె కుమారులు నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు.

వీరు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :