పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలం చాగంటి వారి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కొత్త లుక్ లో కనిపించారు. తలకు కండువా, పంచె కట్టుకొని చూపరులను ఆకర్శించారు. గోధుమ రంగు పట్టు పంచె లో ఆయన ‘పల్నాడు బ్రహ్మనాయుడు’ లా కన్పించారు. ఆయనలో తెలుగుదనం, పల్లె సంప్రదాయాలు స్పష్టంగా కన్పించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు కూడా పంచె కట్టుతో పాల్గొన్నారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి మాట్లాడుతూ రోహిణి నక్షత్రం నుండి జేష్ఠా నక్షత్రం లోకి ప్రవేశించే సమయంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం శుభ సూచిక మన్నారు. కాకతీయుల కాలంలో నాటినుండి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కూడా ఏరువాక కార్యక్రమాలు చేపట్టినట్టు సూచికలు ఉన్నాయన్నారు.