పల్నాడు జిల్లా,: పల్నాడు జిల్లాలో తొలిసారిగా గ్రామ సచివాలయం లో ఉద్యోగిగా విధుల్లో ఉంటూ ఆకస్మికంగా చనిపోయిన ఉద్యోగి (భార్య)ఖరిష్మా కు సచివాలయం లో ఉద్యోగం కేటాయించి జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి మానవత్వాన్ని చాటుకున్నారు. బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా షేక్.సద్దాం హుస్సేన్ గత ఏడాది 2022 జనవరి 9 న చనిపోయాడు. అదే ఏడాది జూలై లో పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో సద్దాం హుస్సేన్ భార్య కారుణ్య నియామకం ద్వారా తనకు సచివాలయంలో ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. మన పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి డిసెంబరు నెలలో బాధితురాలికి మాచర్ల మండలం రాయవరం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని సోమవారం సాయంత్రం ఎస్,ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాల్ లో బాధితురాలు ఖరిష్మా కి జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అందజేశారు.
