వినుకొండ :- పట్టణ పోలిస్ స్టేషన్ ను పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సందర్శించారు… అనంతరం ఎస్పీ మీడియా తో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లా లో చెప్పుకోదగ్గ గోడవలు జరగలేదని చెప్పారు… ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడగింపు చేయడం జరుగుతుందని తెలిపారు…
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు… వారిని గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం వారు పరారిలో ఉన్నట్లు సమాచారం అన్నారు … విధ్వంసాలు మంచిది కాదని ఏవరైనా అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.