పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీ కేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వ్యక్తి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పనిచేస్తుండగా.. బదిలీపై పల్నాడుకు కలెక్టర్ గా రానున్నారు.