అల్లూరి జిల్లా, అనంతగిరి, ది రిపోర్టర్ : అనంతగిరి మండలం, బొర్రా గ్రామపంచాయతీ లో గత మూడు నెలల నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శి లేక పోవటం తో పంచాయతీలో ఉన్న గ్రామాల అభివృద్ధి ఆమడ దూరంలో పడి ఉందని ప్రజా ప్రతినిధులు, ప్రజాలు ఆవేదన వ్యక్తపరిచారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజాలు శనివారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ… దేశ నలుమూల నుండీ బొర్రాగుహలును తిలకించేందుకు వచ్చే ప్రధాన బొర్రా పర్యాటక కేంద్రంలో మూడు నెలల నుండి పంచాయతీ కార్యదర్శినీ సంబంధిత మండల అధికారులు నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అసలే వేసవి కాలం పంచాయతీ లో అనేక గ్రామాలలో మంచినీటి సమస్యతో బిక్కుబిక్కుమంటూ అల్లాడిపోతుంటే, ఇంకో వైపు పర్యాటకులు వాడి పడేసిన ప్లాస్టిక్ చెత్త,చెదరాలు కుప్పలు తిప్పలుగా పడి దుర్వాసనకు గురవుతుంది. పంచాయతీలో కార్మికులు ఉన్న ఇప్పటికీ నెలల వారి జీతాలు లేక పనులు మానీవేశారు. చిన్న చిన్న నిధులు ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి లేక ఎక్కడి ఉన్న గొంగళి అక్కడ ఉన్నట్లుగా పంచాయతీ లో ఉన్న సమస్యలు, అభివృద్ధి పరిస్థితి ఒక మూలన కూరుకు పోయిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత మండల అధికారులు చాకచక్యంగా వ్యవహరించి బొర్రా గ్రామపంచాయతీకి కార్యదర్శిని ఏర్పాటు చేసి పంచాయతీలో ఉన్న గ్రామాల సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు. ఇది ఇలాగే నత్తనడకన సాగితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రసన్నకుమార్, వైస్ మాజీ సర్పంచ్ విజయ్ కుమార్,గ్రామ కమిటీ లీడర్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.