- కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
పల్నాడు జిల్లా: మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెండి గోపి (20) ని కన్న తల్లిదండ్రులు .దారుణంగ చంపారు. జులాయిగా తిరుగుతూ కనిపించిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నాడని మూడు రోజుల క్రితం కోపంతో ఇనుప రాడ్ తో కొట్టడంతో అక్కడక్కడే చనిపోయాడు.కొడుకు శవాన్ని మూటగట్టి ఆటో డ్రైవర్ సహాయంతో తీసుకెళ్లి పొలంలో పాతి పెట్టిన విషయం బయటకు పొక్కడంతో సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు పాతిపెట్టిన వెండి గోపి శవాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.