చెప్పాల్సిన ఓ ఫాస్టర్ పాడు పనులకు పాల్పడ్డాడు. ఓ వైపు ఫాస్టర్ గా ఉంటూనే మరో వైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతగా చలామణీ అవుతూ వరుసకు సోదరి సంబంధం కలిగిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయాడు. మహిళకు తెలియకుండా తన భర్త సీక్రెట్ గా మొబైల్ లో వీడియో ఆన్ చేసి ఇంట్లో పెట్టి వెళ్లడంతో ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గుట్టు రట్టయింది. మహిళ భర్త సెల్ ఫోన్ లోని వీడియోల ఆధారంగా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సదరు నేతను అమీన్ పోలీసులు అరెస్టు చేశారు. మహిళ భర్త రాయని రాజు తెలిపిన వివరాల ప్రకారం అమీన్ పూర్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ భర్త తీట్ల దేవ శిఖామణి ఫాస్టర్ గా, అధికార పార్టీకి చెందిన నేతగా కొనసాగుతూ సాయి భగవాన్ కాలనీలో నివాసం ఉంటున్న రాయని రాజు భార్య పద్మజతో గత కొద్ది రోజులుగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య పద్మజపై అనుమానం తో భర్త రాజు ఇంట్లో సెల్ ఫోన్ సీక్రెట్ కెమెరా అమర్చి వెళ్లగా దేవ శిఖామణి రాసలీలలు బయటపడ్డాయి. భర్త వద్ద తమ అక్రమ సంబంధం వీడియోలు ఉన్నాయని తెలుసుకుని దేవ శిఖామణి, ఆయన అనుచరులు భర్త రాజుపై దాడి చేసి కిడ్నాప్ చేయడంతో ప్రాణభయంతో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో రాజు సెల్ ఫోన్ లోని వీడియోల ఆధారంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. శిఖామణి ని అరెస్టు చేసిన అమీన్ పూర్ పోలీసులు నిక్కర్ పై నిలబెట్టి దర్యాప్తు చేశారు. దర్యాప్తు లో అక్రమ సంబంధం విషయాన్ని శిఖామణి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. రాజు పిర్యాదు పై 448,363,324,342,506 ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
