- జ్యోతిష్య పండితులకు దిశానిర్దేశం చేసిన శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు.
- తిరుపతిలో ముగిసిన రాష్ట్రీయ జ్యోతిష్య సమ్మేళనం
తిరుపతి: మానవసమాజానికి దిక్సూచిగా నిలిచిన జ్యోతిష్య శాస్త్రాన్ని భావితరాలకు అందించాలనీ కంచికామకోటి పీఠ జగద్గురువులు
శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు జ్యోతిష్య పండితులకు దిశానిర్దేశం చేసారు. తిరుపతి పుణ్యక్షేత్రం వేదికగా..కంచికామకోటి పీఠ జగద్గురువులు
శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశ్శీసులతో, ప్రముఖ జ్యోతిష్య పండితులు, సిద్దాంతి విజయ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రీయ జ్యోతిష్య సమ్మేళనం ఆదివారం ముగిసింది. అంతకు ముందు సమ్మేళనానికి విచ్చేసిన కంచికామకోటి పీఠ జగద్గురువులు
శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి జ్యోతిష్య పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం శ్రీకంచికామకోటి పీఠం వారి ప్రత్యేక సంచికతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు,పరిశోధకులు ఉపద్రష్ట సూర్యనారాయణ మూర్తి రచించిన నామచక్షత్ర వివేచన పుస్తకాన్ని స్వామి వారు ఆవిష్కరించారు.అలాగే వైఖానస ఆగమశాస్త్ర విద్యనభ్యసించిన 150 మంది విద్యార్థులకు విజయపట్టాలను అందించి ,ఆశ్శీర్వదించారు.అదేవిధంగా జ్యోతిష్య పండితులకు ప్రశంసాపత్రాలు ,జ్ఞాపికలను అందించి సత్కరించారు.తర్వాత హరికత విశిష్టతను కొనియాడిన శంకర జయేంద్ర సరస్వతి స్వామి వారు,దానికి సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ..జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. జ్యోతిష్య శాస్త్రాన్ని పురోహితులు, వేద విద్యనభ్యసించిన విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. అలాగే వేద గణితాన్ని చిన్నతనం నుంచి అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రంలో చెప్పిన అంశాలను శులభంగా తెలుసుకోవచ్చునన్నారు.జ్యోతిష్యం ,వాస్తు ,దేవాలయ వాస్తు శాస్త్రాలకు సంబంధించిన అంశాలను ,శిల్ప ,ఆగమశాస్త్ర పండితులంతా లోతుగా అధ్యయనం చేసి, లోకహితం కోరే విషయాలను ప్రపంచానికి తెలియజేయాలన్నారు. ఖగోళ పరిశోధనలను విస్త్రతంగా చేయాలని సూచించారు. దీనికి సంబంధించి, అధికారులు కూడా సహాయ సహకారాలు అందించి, జ్యోతిష్య శాస్త్ర శాస్త్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని జ్యోతిష్య పండితులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, భక్తులు పాల్గొన్నారు.