సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్చెరు మండలం, పటాన్చెరు డివిజన్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 271 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 2 కోట్ల 71 లక్షల రూపాయల చెక్కులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేసారు. నిరుపేద ప్రజలకు ఆడబిడ్డ వివాహాభారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ అండగా నిలుస్తుందని ఎంఎల్ఏ జిఎంఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎమ్మార్వోలు రంగారావు, సంగ్రం, లబ్ధిదారులు పాల్గన్నారు