సంగారెడ్డి జిల్లా / పఠాన్ చేరు : నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలలో నూతన రోడ్ల నిర్మాణాలు, రహదారుల మరమ్మతుల నిమిత్తం 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞాపన పత్రం అందించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో.. మంత్రి సీతను కలిసి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఆయన చర్చించారు. ప్రధానంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల పరిధిలో నూతన కాలనీలో ఏర్పాటవుతున్న తరుణంలో రహదారుల నిర్మాణం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నూతన రహదారుల నిర్మాణానికి 43 కోట్ల రూపాయలు, రహదారుల మరమ్మత్తులకు 17 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క.. త్వరలోనే ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.