సంగారెడ్డి / పఠాన్ చేరు : నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞాపన పత్రం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. పటాన్చెరు పట్టణంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నూతన పిహెచ్సిల ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.