సంగారెడ్డి / పఠాన్ చేరు : నిన్న కురిసిన భారీ వర్షాలకు పటాన్చెరువు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాలనీలో గల గాడిదలకుంట చెరువు నిండి చే ఇళ్లలోకి వరద నీరు వెళ్ళడంతో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఈ రోజు ఉదయం ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి, వెంటనే GHMC సిబ్బందిని నియమించి జేసిబి యంత్రాలతో గాడిదలకుంట ప్రధాన అలుగు ద్వారం గుండా వరద నీరు తొలగిపోయేలా పూడికతీత పనులు చేపట్టారు. స్పందించి సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ ను స్థానికులు అభినందించారు.