మదనపల్లి : నేటి తరానికి జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆదర్శం అని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ అన్నారు. గతంలో తాను అధికారులు లేని సమయంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా నేరుగా అక్కడికి చేరుకొని ఆ సమస్య తీరేంతవరకు పోరాటం చేశారన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం చేయలేని పనిని తన సొంత డబ్బులతో మరణించిన కౌలు రైతు కుటుంబాలకు బాసటగా నిలిచారన్నారు. నేడు ఉప ముఖ్య మంత్రి అయ్యిన తర్వాత కూడా గతంలో లాగానే ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామలే అన్న మహాత్మా గాంధీ మాటలకు అనుగుణంగా ఇప్పటివరకు ఏ నాయకుడు గ్రామీణాభివృద్ధికి వేయని బాటలు పవన్ కళ్యాణ్ వేస్తున్నారని, గత ప్రభుత్వ పాలకులు వారి జన్మదినాన్ని పబ్బుల్లో, ఫైవ్ స్టార్ హోటల్లో జరుపుకుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం తన నియోజకవర్గంలో ని ఆడ పడుచులకు ఒక అన్నయ్యలా చీరలు పంచి వారి ఆశీర్వాదం తీసుకున్నారన్నారు. ‘వనం – మనం ‘ కార్యక్రమం రాష్ట్ర మొత్తం జరుపుకున్నారని అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని మొక్కలు నాటడం జరిగిందని, ఈ సందర్భంగా దేశవాళీ మొక్కలను నాటడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందంటూ ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలు దేశభక్తిని మరియు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తోందని, ఆయన చేసి పని వేసే ప్రతి అడుగు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.