జాతీయ అంతర్జాతీయ ఆర్థిక పరిమాణాలు సంక్షోభాలపై రేపు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరగనున్న రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ పి డి ఎం తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పిడుగురాళ్ల ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర కరపత్రావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.ఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోనికి వచ్చినప్పటినుండి కార్పొరేట్లకు మేలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను దేశ ప్రజల వనరులను కారుచౌకగా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడమే పనిగా పెట్టుకున్నది దీనివలన దేశంలో ఆర్థిక అసమానతలు పెరగడంతో ఆకలి చావులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి మరో ప్రక్క ధరలు పెరిగిపోయి సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టంగా మారి తినడానికి తిండి లేక అల్లాడు తుంటే దేశ ప్రజల మీద పన్నుల భారం మోపి అప్పులు పాలు చేస్తూ దేశ సంపదను ఆదాని కంపెనీలకు అప్పజెప్పడం దుర్మార్గమని ఇలాంటి సమయంలో మన దేశంలో జరుగుతున్న ఈ మార్పులు పరిణామాల మీద దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నిర్వహిస్తున్న సదస్సులో ఏపీపీఎఫ్ పూర్వ అధ్యక్షులు ఏ నరసింహారెడ్డి, సి ఎల్ సి చిలుకా చంద్రశేఖర్, విరసం వరలక్ష్మి పాల్గొని ప్రసంగించెదరు గనుక ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, బుద్ధి జీవులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం. సి. పి. ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు కృష్ణ ,సి.పి.ఐ పట్టణ కార్యదర్శి జే కృష్ణా నాయక్ ,సిటియు నాయకులు నారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.