contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మంచిర్యాల జోన్ పోలీస్ ఆధ్వర్యంలో శాంతి సమావేశం

  • మతాలకు అతీతంగా పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: డీసీపీ సుదీర్ రాంనాథ్, ఐపిఎస్

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల జైపూర్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ముస్లిం, హిందూ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని మంచిర్యాల డిసిపి గారి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డిసిపి గారు మాట్లాడుతూ..ప్రారంభమవుతున్న రంజాన్ మాసంతో పాటు ఈ నెల చివరిలో వస్తున్న శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగలను జిల్లాలో ఎన్నో ఏళ్లుగా మతాలకు అతీతంగా గౌరవించి ప్రతి పండుగను సోదరభావంతో శాంతియుతంగా జరుగుతుందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ పోలీస్ వారికి సహకరించాలని మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్., గారు అందరికి సూచించారు. జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరు సోదర భావం కలిగివుండి శాంతియుత వాతారణంలో మీడియాలో వచ్చే వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసత్య వార్తలను నమ్మి ప్రచారం చెయ్యవద్దని కోరారు. ఏ సమస్య వచ్చిన స్పష్టంగా మత పెద్దలు, పోలీస్ వారి దృష్టికి తీసుకు రావాలని కోరారు. పోలీసు శాఖ పరంగా చేపట్టాల్సిన విధులు నిర్వర్తించడంతో పాటు పోలీసు శాఖకు సహకరించాలని డిసీపీ కోరారు. ఈ సంధర్భంగా స్థానికంగా ఉండే సమస్యలను అడిగి తెల్చుకోవడంతో పాటు సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.

సోషల్ మీడియాలో మతాలను గాని, ఒకరినొకరు వ్యక్తి గతంగా కించపరుస్తూ గాని , అసత్యపు పుకార్లను సృష్టించి ఎవరైనాసోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఏ చిన్న సంఘటన జరిగిన స్థానిక పోలీసులకు, డయల్ 100, ఫోన్ చేసి సమాచారం అధించిన వెంటనే సమ్యసను పరిష్కరిస్తాం అని తెలిపారు. పుకార్లు నమ్మవద్దని తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అనవసర ఉద్రిక్తతలకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రాజు, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, మత పెద్దలు ఎస్సైలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :