పల్నాడు జిల్లా, పెదకూరపాడు : నియోజకవర్గ మండల కేంద్రం పల్నాడు జిల్లా పెదకూరపాడు స్థానికంగా గ్రామంలో పలు సమస్యలు తాండవిస్తున్నాయి. గుంటూరు రోడ్ లోని ముస్లిం కాలనీలో ప్రధాన రహదారి పక్కన పిచ్చి మొక్కలు అలుముకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు , పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న ఎస్సీ కాలనీలో మంచినీటి బావి, గుంతల మయంగా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉర్దూ స్కూల్ వద్ద గుంటూరు, పెద కూరపాడు ప్రధాన రోడ్డు మార్గం, ఇవే కాక కాలనీలోని విద్యుత్ స్తంభాల వైర్లు పాత పడిపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు తెగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టవలసిందిగా స్థానిక ప్రజలు కోరారు.