ప్పాల్నాడు జిల్లా, పెదకూరపాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “శిక్ష సప్తాహ” వారం రోజుల కార్యక్రమంలో భాగంగాఆరవ రోజు శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో పల్నాడు జిల్లా, పెద్దకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. మొక్కలు మానవజాతికి మేలు చేస్తాయని, పరిసరాలు అన్నీ కూడా మొక్కలు నాటితే వాతావరణ, ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయని తెలిపారు .ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణ, ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.