పారిశుద్ధ్య పనులు చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు మండల అభివృద్ధి అధికారి మల్లేశ్వరి చేతుల మీదుగా యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మల్లేశ్వరి మాట్లాడుతూ .. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. పచ్చదనం పారిశుద్ధ్యత కార్యక్రమంలో చెత్త చదరాన్ని తొలగించాలని, పిచ్చి మొక్కలు తొలగించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆమె కోరారు.
ఎంపీడీవో మల్లేశ్వరి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారం పెదకూరపాడు గ్రామంలోని మురుగు కాలువలను, రోడ్ల వెంబడి చెత్త కుప్పలను , గృహ ఆవాసాల మధ్య మురుగును పూర్తిగా తొలగించే కార్యక్రమం శనివారం నిర్వహించారు.