- స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెదకూరపాడు జెడ్పీ పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయల వ్యక్తిగత సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ .
- పెదకూరపాడు తహసిల్దార్ కార్యాలయం మరియు జడ్పీ హైస్కూల్ నందు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా వందనం చేసిన ఎమ్మెల్యే
- ప్రజల వ్యక్తిగత సంపాదనలో 10% స్కూల్స్, ఆశ్రమాలు, సమాజహితం కోసం సహాయం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే.
- కార్యక్రమంలో భారీగా పాల్గొన్న విద్యార్థులు, గ్రామస్తులు .
- ఎమ్మెల్యే ధాతృత్వానికి అభినందనలు తెలియజేసిన స్థానిక ప్రజలు.
పల్నాడు జిల్లా / పెదకూరపాడు : ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను వినియోగించుకుని విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి తక్షణ సాయంగా లక్ష రూపాయలు వ్యక్తిగత సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఎంతో మంది త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కొనియాడారు. ఉపాధ్యాయులు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర ను తెలియజేయడం ద్వారా విద్యార్థుల్లో దేశ భక్తి పెంపొందించాలని, ప్రతి రోజు జరిగే కార్యక్రమాల గురించి వార్తా పత్రికల్లో వచ్చే విషయాలను విద్యార్థులకు వివరించేలా చర్యలు తీసుకొని తద్వారా విద్యార్థులు చిన్నతనం నుండే సమాజాన్ని గురించి అవగాహన కలిగేలా ఉంచాలని కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రను వివరించే సినిమాలను,వీడియోలను పాఠశాలల్లో ప్రదర్శించడం ద్వారా దేశ భక్తి ఐకమత్య భావాలు పెరుగుతాయన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఒక సైంటిస్టుగా దేశ ఉపరాష్ట్రపతి గా ఎదిగిన మాజీ ఉప రాష్ట్రపతి ఎపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అనేక మంది మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం సంక్షేమ ఫలాలను అందరికీ సమానంగా అందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా అన్నీ వ్యవస్థలు అవినీతి కోరల్లో కురుకుపోయాయన్నారు. రానున్న రోజుల్లో అవినీతి రహిత వ్యవస్థలను నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రవీణ్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందించారు మిడ్ డే మీల్స్ ప్లేట్లను పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను ఎమ్మెల్యే ప్రవీణ్ అందించారు.