- పల్నాడు జిల్లా, పెదకూరపాడు మిల్క్ సొసైటీ భవనంలో గురువారం సంగం డెయిరీ పాల ఉత్పత్తి రైతులకు బోనస్ పంపిణీ చేశారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.
- 200 మంది పాడి రైతులకు 6,04,000 రూపాయల చెక్కులను అందించారు. ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా / పెదకూరపాడు : పెదకూరపాడు మిల్క్ సొసైటీ భవనంలో గురువారం సంగం డెయిరీ పాల ఉత్పత్తి రైతులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంగం డైయిరి ఏర్పాటు చేసిన నాటి నుండి పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయమని అన్నారు. సంగం డెయిరీ చైర్మన్ గా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డెయిరిని అంచలంచెలుగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేలా కృషి చేస్తున్నారని వెల్లడించారు. స్వచ్చమైన పాలను ప్రజలకు అందించడంతో పాటు పాల ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంలో ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లో సంగం డెయిరీ మంచి పేరు తెచ్చుకుందని అభినందించారు. డెయిరీ కి వచ్చిన లాభాల్లో రైతులను భాగస్వాములను చేస్తూ బోనస్ ల పేరుతో రైతులకు లాభాలను పంచడం అభినందనీయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశుగ్రాసం కోసం పన్నెండు వేల రూపాయల నగదును ఇవ్వడంతో పాటు దాణా కోసం సబ్సిడీ ఇవ్వడం,పశువులకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం అనేది గొప్ప విషయమని పేర్కొన్నారు. సంగం డెయిరీ పక్కనే ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి పేరుతో హాస్పటల్ ను ఏర్పాటు చేసి రైతులకు యాభై శాతం సబ్సిడీతో మెరుగైన వైద్యాన్ని అందించడం ప్రశంసనీయం అని తెలిపారు. పెదకూరపాడు పరిధిలో గతంలో పాల ఉత్పత్తి అధికంగా ఉండేది ఇప్పుడు అది కొంచం తగ్గుముఖం పట్టిందని, నియోజకవర్గ పరిధిలో పాడి రైతులు పాల ఉత్పత్తిని పెంచేలా వ్యవహరించాలని కోరారు. సంగం డెయిరీ అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై రైతులు చైతన్య వంతులై పశు పోషణ అభివృద్ధికి కృషి కృషి చేయాలని పాడి రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు గ్రామ సర్పంచ్ గుడిపూడి రాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అత్తిమళ్ళ రమేష్, రైతులు పాల్గొన్నారు