ఎటువంటి క్లిష్టమైన నేరాలు అయినా నూతన టెక్నాలజీని ఉపయోగించి కేసులను చేధించడంలో పోలీసులు ముందుండాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐ.పి.ఎస్., అన్నారు. ఈరోజు మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా పాత నెరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు అలాగే రోజు వారి వాహన తనిఖీలు చేస్తూ, నంబర్ ప్లేట్స్ సరిగ్గా లేని వాహనాల మీద నిఘా పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చెప్పటాలని, డ్రంక్ & డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవరించాలని…రోడ్డు భద్రత నియమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలపై అఘాత్యాలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలన్నారు.
డీసీపీ వెంట గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సతీష్ ఎస్సై రాములు , ఉన్నారు.