హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి హరీశ్ రావుపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అస్సోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను యూటీగా చేస్తారని మాట్లాడటం సరికాదన్నారు. హరీశ్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం… 20 ఏళ్ళకు పైగా ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి బోడిగుండుకు… మోకాలికి లింక్ పెడుతున్నారని విమర్శించారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు తలాతోక లేని వ్యాఖ్యలు చేశారన్నారు. పదేళ్ళు తెలంగాణ బిడ్డల అణచివేతకు కారణమైన తెరాస పార్టీ తెలంగాణ బిడ్డల పై ప్రేమ ఉన్నట్టు నటించడం, ఊసరవెల్లి మాటలు మాట్లాడడం, కుటుంబ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు.
అంతకుముందు, హరీశ్ రావు మాట్లాడుతూ… హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయిందని… ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను మరికొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. అదే జరిగితే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కటవ్వాలన్నారు. గతంలో పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటే కేసీఆర్ వ్యతిరేకించారని.. ఇప్పుడు మరోసారి అలాంటి కుట్రలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసి సాధించామని చెప్పుకునే కేసీఆర్ తన పార్టీ పేరులో తెలంగాణ తీసివేయడం పెద్ద మైనస్ అని అని అన్నారు … నేటికీ తెలంగాణ బిడ్డలు ఆంద్రోళ్ళ చేతిలో నలిగిపోతున్నారని, సంపూర్ణ తెలంగాణ వస్తేనే తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవరం నిలబడుతుందని అన్నారు.
1969 తెలంగాణ ఉద్యమం:
1948లో పోలీస్ యాక్షన్ తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్ అధికారుల పాలనలో ఉండటంవల్ల ఆంధ్ర ప్రాంతంనుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంలో అమల్లో ఉన్నా ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి. పెద్దమనుషుల ఒప్పందంను గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ లోని థర్మల్ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు.
ఎక్కడైతే సమస్యని అణచివేయాలని చూస్తారో అక్కడే ఉద్యమం పుడుతుంది. తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా తెలంగాణ సినీ, టీవీ ఇండస్ట్రీలో శ్రమ దోపిడీ, అణచివేత ఆగలేదు .. తెలంగాణ నిర్మాతల, దర్శకుల, కళకారుల, కార్మికుల, ఎక్సబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్ల అణచివేత నేటికీ సాగుతుంది. గత ప్రభుత్వం లో పట్టించుకోలేదు, ప్రస్తుత పాలకులు కూడా పట్టనట్టు వ్యవరిస్తున్నారు.
తెలంగాణాలో ఆంధ్రా పెత్తందారుల యూనియన్, అసోసియేషన్ల అక్రమ వసూళ్ల దందా కొనసాగుతోందని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ మండిపడ్డారు . కొత్తగా వచ్చే కళాకారులను పని చేయనివ్వకుండా అడ్డుకుంటూ, ఆంధ్రా సినీ యూనియన్లు , టీవీ అసోసియేషన్లు దౌర్జన్యాలకు పాలుపడుతున్నారని ఆరోపణలు నిలువెత్తున ఉన్నాయి. ఒక సామాన్య కళాకారుడు లక్ష, రెండు లక్షలు , నాలుగు లక్షలు పోసి గుర్తింపు కార్డు తీసుకొని పనులు చేసుకునే పరిస్థితి ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన వచ్చింది. సినిమా ప్రొడక్షన్ లో వంట వండాలంటే గుర్తింపు కార్డుకు సుమారు 3 లక్షల రూపాయలు చెల్లించాచాలని కొందరు బాధితులు బోరున విలపిస్తున్నారు. యూనియన్లు , అసోసియేషన్ల పేరుతో జరుగుతున్నా మోసాలను అరికట్టడానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోక పొతే విచ్చలవిడితనం పెరుతుగుతుంది. సంఘాల నాయకులమని చెప్పుకుంటూ బెదిరింపులు, కార్మికుల అణచివేత, డబ్బు కోసం ఎంతవరకైనా దిగజారే పరిస్థితికి చేరుకుంటారు.
నేటి కి విభజన చట్టం అమలు కాలేదు. తెలంగాణ సినీ, టీవీ కార్మిక సంఘాలు చెల్లవు, ఫెడరేషన్ ఫేక్ , ఛాంబర్ లేదు. తెలంగాణ కార్మిక సంఘాలలో ఉంటె కడుపు పై కొడతారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా సినీ కార్మిక సంఘాలు తెలంగాణ సినీ కార్మిక సంఘాలు చెల్లవంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల ఆగడాలకు అంతులేదు. కలెక్షన్లు, మోసాలు, దందాలు పట్టించుకునే అధికారి గాని, నాయకులు గాని లేరు. గత ప్రభుత్వం తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై పట్టనట్టు వ్యవహరించింది. కనీసం సియం రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల సమస్యల పై స్పందిస్తారని ఆశించారు. కానీ ఆంధ్రా సినీ పెత్తందారులకు ఆహ్వానాలు, అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు ? ఆంధ్రా సినిమాటోగ్రఫీ మంత్రి అని పెట్టుకుంటే సరిపోలే ? తెలంగాణ మంత్రుల తీరునుబట్టే ఆంధ్రా పెత్తందారులు తెలంగాణ సినీ మరియు టివి కార్మికులను అణచివేస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు.
తెలంగాణ భాషను వెక్కిరిస్తారు, యాసను వెక్కిరిస్తారు. తెలంగాణ స్లాంగ్ ఉన్న క్యారెక్టర్ కి ఆంద్రోళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. అంటే అణచివేత ఎక్కడుంది ? మనకి కనబడేది ఒకటి చేస్తున్నది మరొకటి ఎవరు గమనించాలి ? ఎవరు తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినేది ! పని చేయించుకుని కార్మికుల వేతనాలు ఇవ్వరు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. అడిగితె రౌడీ షీటర్స్ తో బెదిరింపులు లేదా అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత మానసిక వేదనకు గురిచేస్తున్నారు. అంటే డబ్బుతో పోలీసులను, రౌడీ షీటర్స్ ను కొంటున్నారా ? లేక ఏంటి ? సుమారుగా 40 ఏళ్ళు ఆంధ్రా సినీ పెత్తందారుల చేతిలో తెలంగాణ బిడ్డలు అడుగడుగునా అణచివేయబడుతున్నారు.
తెలంగాణ సినీ మరియు టీవీ పరిశ్రమను ఏర్పాటు చేసే విషయంలో సమగ్రమైన కార్యాచరణ చేపట్టి, శాఖను పటిష్టం చేయాలి. తెలంగాణ సినీ మరియు టివి కార్మికులకు న్యాయం చేసే ఏ కార్యక్రమంలో అయినా ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో అన్యాయం జరిగిన ప్రతిచోటా పేద సినీ మరియు టివి కార్మికుల గొంతుకగా నిలబడి రాజీలేని పోరాటం చేయడానికి వెనుకాడబోనని వి.సుధాకర్ తెలిపారు.