ఢిల్లీ : చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పర్వదినాన్ని జరుపుకోబోతున్న తెలుగు ప్రజలందరికీ, జర్నలిస్టులకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అస్సోసిషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది అని ప్రస్తావించారు. ఈ దీపావళిని మరింత కాంతివంతంగ జరుపుకోవాలని సుధాకర్ కోరారు.
దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసుల మోత. పల్లె నుంచి పట్టణం వరకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీఒక్కరూ దీపావళికి టపాసుల మోతమోగిస్తారు. టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా అపాటించాలని సుధాకర్ తెలిపారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- బాణసంచా కాల్చడంతో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పరిమితి సంఖ్యలో టపాసులు కాల్చాలి
- ఎట్టిపరిస్థితుల్లో చేతిలో పట్టుకొని టపాకాయలను వెలిగించొద్దు.
- వాటిపై వంగి టపాకాయలను వెలిగించొద్దు.. వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా కొంతసేపు ఆగి వెళ్లాలి.
- సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండవంటి పాత్రల్లో పెట్టి టపాకాయలను వెలిగించవద్దు. అలా చేస్తే ప్రమాదం భారినపడేఅవకాశం ఎక్కువ.
- క్రాకర్స్ కాల్చే సమయంలో సింథటిక్, వదులుగా ఉన్న దుస్తులు కాకుండా మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించండి.
- భారీగా గాలులు వీచే సందర్భంలో బాణసంచా కాల్చవద్దు. అలాచేయడం వల్ల గాలికి నిప్పురవ్వలు మీ మీదపడటం లేదా పక్కవారిమీద పడటం జరిగి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ.
- బాణసంచా కాల్చే సమయంలో పిల్లల్ని ఒంటిరిగా వదలొద్దు. తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి.
- బాణసంచా కాల్చే సమయంలో కంటికి రక్షణగా కళ్లద్దాలను ధరించాలి. టపాసులు కాల్చేసమయంలో ముఖాన్ని వాటికి దగ్గరగా ఉంచొద్దు.
- అనుకోని పరిస్థితుల్లో బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలినచోట క్రీమ్, ఆయింట్ మెంట్ , నూనె పూయకండి.. వెంటనే వైద్య సహాయం తీసుకొనేలా చర్యలు తీసుకోండి.
- దగ్గరలో నీటిని అందుబాటులో ఉంచుకొని టపాసులు పేల్చాలి. ఒకవేళ చర్మంపై నిప్పురవ్వలు పడి కాలినట్లయితే, కాలినచోట ఎక్కువ నీరు పోయాలి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. సొంత వైద్యం వద్దు.
- ఒకవేళ తీవ్రమైన కాలిన గాయాలైతే.. మంట ఆర్పిన తరువాత, ఆ వ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.