మదనపల్లి : నేడు ఏపీ బి సి. చైతన్య సమితి అధికార ప్రతినిధి సహాజీవ్ బాబు ఆధ్వర్యంలో పెరియార్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సహాజీవన్ మాట్లాడుతూ పెరియర్ సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడిన వ్యక్తి అని మరీ ముఖ్యంగా అన్ని కులాల వారి కి సమానంగా దేవాలయ ప్రవేశం ఉండాలని ఎంతగానో వాదించిన గొప్ప వ్యక్తి అన్నారు, తమిళనాడులో ఆనాడు నుండి ఈనాడు వరకు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే ఏడీఎంకే పార్టీల స్థాపనకు మూల కథ పెరియార్ రామస్వామి నాయకర్ అని , మన భారతదేశంలో పెరియర్ లాంటి ఎంతోమంది మహానుభావులు సమానత్వం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసినా,ఇప్పటికీ భారత దేశంలో పలుచోట్ల కొన్ని కులాల వారిని దేవాలయాల్లోకి రానివ్వడం లేదని, ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరమని, ఇకనైనా అలాంటి సంఘటనలు జరగకుండా దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.