contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం… వీడియో ఇదిగో!

బెంగళూరు లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. నగరంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. కేఆర్ మార్కెట్ వద్ద సిర్సి సర్కిల్ ఫ్లై ఓవర్ పైనుంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లు జనంపైకి విసిరేశాడు. ఆ నోట్లను అందుకునేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. వాహనాలు ఆపి మరీ రోడ్డుపై నోట్ల వేట సాగించారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

నోట్లు విసిరిన వ్యక్తి సూటుబూటు ధరించి మెడలో ఓ గోడ గడియారాన్ని తగిలించుకుని విచిత్ర వేషధారణతో కనిపించాడు. చేతి సంచి నిండా ఉన్న కరెన్సీ నోట్లను ఫ్లై ఓవర్ పైనుంచి వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఆ వ్యక్తి వెదజల్లింది రూ.10 నోట్లు అని తెలుస్తోంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :