- అతిరధులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన స్థానిక ఎంపీపీ శెట్టి నీలవేణి.
అల్లూరి జిల్లా :అనంతగిరి, ది రిపోర్టర్ : అనంతగిరి మండల కేంద్రంలో ఐటిడిఏ పాడేరు ఆధ్వర్యంలో నిర్మించిన హిందుస్థాన్ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం గురువారం అటహాసంగా జరిగింది . అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్, అరకులోయ పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకులోయ శాసనసభ్యులు శెట్టి పాల్గుణ,జెడ్పిటిసి దీసరి గంగరాజు, సర్పంచ్ సోమెల రూతుకి స్థానిక ఎంపీపీ శెట్టి నీలవేణి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం బంక్ ప్రారంభించారు. బంకు నిర్వహణను ఐటిడిఏ నేరుగా చేపడుతుందని స్పందనలో వచ్చిన దరఖాస్తులను ఆధారంగా సిబ్బందిని పూర్తి పారదర్శకతో నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బంకు నిర్వాహకులకు తెలిపారు. బంకు ప్రారంభం సందర్భంగా అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి నేరుగా వాహనానికి ఆయిల్ వేశారు. బంకు ద్వారా ఐటిడిఏకు ఆదాయం మరింత మెరుగ్గా వచ్చేలా సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. విశిష్ట అతిధుల మధ్య అటహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శెట్టి ఆనంద్, పూర్వ ఎంపీపీ శెట్టి గంగాధర్ స్వామి, కోఆప్షన్ సభ్యుడు షేక్ మదీనా, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాలరావు ,డి ఈఈ సుబ్బారావు,ఎంపీడీవో ,ఏవివి కుమార్, తహసిల్దార్ రాంబాయి, డిప్యూటీ తాసిల్దార్ లత్సా పాత్రుడు, స్థానిక ఎస్సై రాము, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.