పోలీసింగ్ , సమాజ భద్రతలో సమాచార సాంకేతికత వినియోగంపై పదేళ్లుగా అధ్యయనం చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తాజాగా పీహెచ్‌డీ పట్టా అందుకుని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. జేఎన్‌టీయూహెచ్ తొమ్మిదవ స్నాతకోత్సవంలో ఆయనకు ఆ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్ పట్టాను అందజేశారు.ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వర్చువల్ పద్ధతిలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. కాగా, తన పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సాయపడ్డ గైడ్ తో పాటు ఇతర సభ్యులకు మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధన రాష్ట్ర పోలీసులకు ఉపయోగపడుతుందని చెప్పారు. పీహెచ్‌డీ పట్టా అందడం పట్ల సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.