Beer Lovers Alert: సమ్మర్ సీజన్‌ని మద్యం వ్యాపారులు లాభసాటిగా మార్చుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. సీజన్‌లో బీర్లు తాగేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు.ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని పల్నాడు జిల్లాలో ఓ బార్ & రెస్టారెంట్ లో కాలం చెల్లిన బీర్లను కస్టమర్లకు విక్రయించారు. తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే బీరు వినియోగించాలి. ఆ తర్వాత వాటిని తాగితే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం లేకపోలేదు!.
అయితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని వెంకట్రామ బార్ అండ్ రెస్టారెంట్ లో మార్చి నెలలోనే కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ డేట్) బీర్లను ఏప్రిల్ 4వ తేదీన విక్రయిస్తుండడంపై మద్యం ప్రియులు మండిపడుతున్నారు. సమ్మర్ సీజన్‌ని మద్యం వ్యాపారులు లాభసాటిగా మార్చుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. సీజన్‌లో బీర్లు తాగేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని కాలం చెల్లిన బీర్లను కస్టమర్లకు విక్రయించారు. వెంకట్రామ బార్ అండ్ రెస్టారెంట్ లో కొందరు బీర్లు సేవించారు. తాగిన తర్వాత దానిమీద కాలం చెల్లిన డేట్ చూసి అవాక్కయ్యారు. ఇలా కాలం చెల్లిన బీర్లు తాగిన వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సంబంధించిన అధికారులు తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మందు బాబులు ఆరోపిస్తున్నారు. స్థానిక సెబ్ అధికారుల అండదండలతోనే ఈ దందా జరుగుతున్నట్టు బలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా సంబంధించిన అధికారులు తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన బీర్లను సీజ్ చేయాలని స్థానికులు కోరారు.
కాలం చెల్లిన బీర్ తాగిన వ్యక్తికీ అనారోగ్యబారిన పడ్డట్టు సమాచామరం. గొంతు సమస్య అలాగే తీవ్ర జ్వరంతో మంచాన పడ్డట్టు తెలుస్తోంది. స్థానికి సెబ్ సిఐ కి, ఎక్సయిజ్ వారికి భారీగానే ముడుపులు ముట్టడంతో రెస్టారెంట్ పై తగు చర్యలు తీసుకోకుండా ఏమి తెలియనట్టు, ఏమి జరగనట్టు వ్యవహరిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.