పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణం మందుబాబులకు అడ్డాగా మారడం చాలా దురదృష్టకరమని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కఖాసీం సైదా అన్నారు,నిత్యం అనేకమంది ప్రజలు అనేక అవసరాల నిమిత్తం మండల పరిషత్ కార్యాలయానికి వస్తూ ఉంటారు, కార్యాలయం ముఖద్వారానికి ఎదురుగా ఉన్న చెట్టు క్రింద తాగి పడేసిన మందు సీసాలు ఉండడం దురదృష్టకరం, అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు, కూతవేటు దూరంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద నిత్యం మందుబాబులకు అడ్డగా మారాయని మహిళలు అటువైపు పోవాలంటేనే భయపడే పరిస్థితి ఉందని,దీనిపై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.