పల్నాడు జిల్లా పిడుగురాళ్ల: కొమ్మూరి కామేశ్వరరావు కిడ్నాప్ సుఖాంతం,. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో గురజాల డి.ఎస్.పి జయరామ్ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పిడుగురాళ్ల పట్టణ పిల్లుట్ల రోడ్డు లెనిన్ నగర్ వద్ద ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న కొమ్మూరి కామేశ్వరరావు, అలియాస్ చెవిపోగు డాక్టర్ , వయసు 44 సంవత్సరాలు, ఈ ఆర్ఎంపీ డాక్టర్ కి 1 ,8, 2022 వ తేదీన పార్టీకి కొంత నగదు ఇవ్వాలని నక్సల్స్ రాసినట్టుగా ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చారు నకిలీ నక్సల్స్, ఎంత వరకు అతని వద్ద నుండి సమాచారం లేకపోవడంతో, పథకం ప్రకారం కొమ్మూరి కాళేశ్వరము అలియాస్ చెవిపోగు డాక్టర్ను కిడ్నాప్ చేశారు, కొంతమంది యువకులు, కొమ్మూరి కామేశ్వరరావు భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల చెరనుంచి సురక్షితంగా కొమ్మూరి కామేశ్వర రావు చెవిపోగు డాక్టర్ని కాపాడారు పిడుగురాళ్ల పట్టణ పోలీసులు , అనంతరం ముద్దాయిలను గురజాల కోర్టులో హాజరు పరుస్తామని తెలియజేశారు డిఎస్పి జయరామ్ ప్రసాద్, మీడియా సమావేశంలో పిడుగురాళ్ల పట్టణ సిఐ మధుసూదన్రావు రూరల్ ఎస్ఐ చరణ్,, ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.