- వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి – ఎంపీ మిధున్ రెడ్డి
- దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ – జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్
- వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలదించాలి – ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
అన్నమయ్య జిల్లా, పీలేరు : దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వైద్యరంగానికి అధిక ప్రాదాన్యత నిస్తూ పేదలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారని లోక్ సభ ప్యానల్ స్పీకర్, ఎంపీ మిధున్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచుతూ నిర్మించిన నూతన భవన నిర్మాణాలను ఎంపీ మిధున్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, 24 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపి మిథున్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్యు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గతంలో రేషన్ కార్డు, పెన్షన్లు కావాలంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ వాళ్లు అరిగేలా తిరిగేవారని నేడు సచివాలయ, వాలంటీర్ల, వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు పేదల ముంగిటకు చేరుతున్నాయన్నారు. గతంలో పీలేరు పట్టణంలో ప్రజలు నీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ప్రస్తుతం నీటి సమస్య పూర్తిగా నివారించడం జరిగిందన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఎన్నడు కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి విశేష కృషి చేస్తూ అనేక సంక్షేమ, పథకాలు అమలు చేస్తోందన్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకలకు పెంచడం ఎంతో గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రికి సంబంధించి రోడ్ల సమస్య, సిబ్బంది సమస్యలు లేకుండా వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంటి పట్టాలు పొందిన వారందరికీ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించి పేదలకు ఒక భరోసా కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేసిన ఇంటి స్థలంలో ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకొని సంతోషంగా జీవించాలన్నారు. ఎవరు కూడా ఇంటి పట్టాను అమ్ముకోకుండా ఒక ఆస్తిలా స్థిరస్థాయిగా నిలుపుకోవాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… పీలేరు పట్టణంలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని వంద పడకు మార్చుకోవడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమన్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందివ్వడం జరుగుతుందన్నారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని పేదల ఇంటి ముంగుటకు చేర్చడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్, ఆర్డిఓ రంగస్వామి, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.