మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. పిన్నెల్లికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో జరిగిన హింసకు సంబంధించిన కేసులో ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.