- ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న కారంపూడి వైసీపీ నాయకులు
పల్నాడు జిల్లా కారంపూడి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుండి కారంపూడిలో మాచర్ల ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి చేపట్టానున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. 25వ తేది సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ముందుగా పల్నాడు ప్రజల ఆరాధ్య దైవమైన అంకళమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి పూజలు నిర్వహించి ఈ కార్యక్రమన్ని ప్రారంభిస్తారని కారంపూడి మేజర్ పంచాయతీ కావటంతో సుమారు 15 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనేది తెలుసుకొని ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు అందిన సంక్షేమ పథకాల జాబితాను కరపత్రం రూపంలో ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి స్వయంగా ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల జాబితాను వివరించటం జరుగుతుందని అలాగే గ్రామంలో ముఖ్యమైన సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యఉద్దేశమని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమనికి సంబంధించి రూట్ మ్యాప్ ను, ఏర్పాట్లను సిద్ధం చేయటం జరుగుతుందని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, వాలంటీర్లు పాల్గొని ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలనీ వైసీపీ నాయకులు కోరుతున్నారు.