- పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి చూపు నాయకురాలు నాగమ్మ రాజ్యం వైపు
- రానున్న ఎన్నికల్లో గురజాల వైసీపీ అభ్యర్థిగా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి..?
- అధిష్టానం చూపు పిన్నెల్లి వైపేనా..?
- పార్టీ పెద్దల ఆశీస్సులతో ఇప్పటికే గురజాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి
పౌరుషల పురిటిగడ్డ పల్నాటి సీమ అనగానే ముందుగా గుర్తొచ్చేది మాచర్ల, గురజాల రాజ్యాలు అలనాడు మాచర్ల రాజ్యాన్ని బ్రహ్మనాయుడు మంత్రిగా పాలిస్తే గురజాల రాజ్యాన్ని నాయకురాలు నాగమ్మ రాజ్యమేలింది. పల్నాటి ప్రాంతంలో రామలక్ష్మణులుగా పిలవబడే మాచర్ల ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటి చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి పల్నాటి లక్ష్మణుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, యువజన విభాగం పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల జోనల్ ఇంచార్జి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి లు మాచర్ల రాజ్యంలో పేదప్రజలకు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని సస్యాశ్యామలంగా పరిపాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి చూపు నాయకురాలు నాగమ్మ రాజ్యం వైపు మళ్ళింది. 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని పల్నాడు ప్రాంతంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కాసు. మహేష్ రెడ్డి నరసరావుపేట లేదా సత్తెనపల్లి నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం గురజాల అభ్యర్థి విషయంలో కొంతమంది వైసీపీ నాయకుల పేర్లు ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే నిర్వహించగా పార్టీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి పేరు ముందున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా గురజాల నియోజకవర్గనికి ముఖ్యంగా గురజాల నియోజకవర్గ టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే యరపతినేని. శ్రీనివాసరావు ను ఢీకొనే సత్తా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి కి ఉందని ఇప్పటికే అధిష్టానం భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆశీస్సులు అందించడంతో పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి ఇప్పటికే గురజాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి సోదరులకు ఒక విశిష్టత ఉంది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న మాచర్ల ను పిన్నెల్లి కుటుంబం వరుసగా 2004 నుండి ఇప్పటివరకు ప్రజల అభిమానాన్ని పొందుతూ వైసీపీ జెండాను ఎగరవేసింది పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయన చేస్తున్న సేవలను పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ తరువాత ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల యువజన విభాగం జోనల్ ఇంచార్జిగా నియమించారు. మొదటినుంచి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డికి పేదప్రజలకు సేవచేయాలంటే ఎంతగానో ఇష్టం ఈ నేపథ్యంలోనే గురజాల నియోజకవర్గ టికెట్ అయన ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూపు కూడా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి వైపే ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు పార్టీ ముఖ్యనాయకులు విజయసాయి రెడ్డి, మాజీ టీటీడి వై. వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల. రామకృష్ణరెడ్డి ఆశీస్సులు కూడా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి వైపు ఉండటంతో రానున్న ఎన్నికల్లో గురజాల టికెట్ కచ్చితంగా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గురజాల నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ దృతీయ శ్రేణి నాయకులు కూడా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి వైపే మెగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్న మాచవరం మండలంలో ఇటీవల పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి దేవాలయానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు మాచవరం మండలంలో హాజరుఅవ్వగా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డికి ఆ ప్రాంత ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభించింది. ఏది ఏమైనా నాయకురాలు నాగమ్మ పాలించిన రాజ్యం వైపు పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి చూపు పడటం దీనికి తోడు పార్టీ పెద్దల ఆశీస్సులు కూడా ఉండటంతో రానున్న ఎన్నికల్లో గురజాల వైసీపీ అభ్యర్థిగా పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని పల్నాడు ప్రాంతంలో జోరుగా ప్రచారం వినిపిస్తుంది.