contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు ఛైర్పర్సన్ గా చెల్లుబోయిన ప్రమీల

కాకినాడ జిల్లా/ పిఠాపురం :  ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు ఛైర్పర్సన్ గా చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ గా మేళం రామకృష్ణ (టైల్స్ బాబీ), డైరెక్టర్లుగా అరిగెల ప్రసాద రావు, అద్దంకి వెంకట రమణ, బాలిపల్లి రామచంద్ర కుమార్ (రాంబాబు)లు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి పి.దుర్గా ప్రసాద్ విజయం సాధించిన ఐదుగురు సభ్యుల చేత ధృవీకరణ పత్రాలపై సంతకం చేయించారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో ఆమె 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి 138 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, మేళం రామకృష్ణ (టైల్స్ బాబీ), అరిగెల ప్రసాద రావు, అద్దంకి వెంకట రమణలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు), జనసేన నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివ శంకర్, మార్నిడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, జ్యోతుల సతీష్, వెన్నపు చక్రధరరావు, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఊటా ఆదివిష్ణు (నానిబాబు), ఓగేటి మురళీ, దేవరపల్లి రామారావు తదితరులు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :