పిఠాపురం : స్థానిక ఆంధ్ర కేసరి ప్రకాశం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు 31 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. మున్సిపల్ హైస్కూల్లో 1992 – 93 సంవత్సరకాలంలో పదో తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు కాకినాడ జిఆర్టి గ్రాండ్ లో ఒకరిని ఒకరు ఆప్యాయతగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అప్పుడు చేసిన అల్లరి చిలిపి చేష్టలు నెమరు వేసుకున్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన హైస్కూల్ ఆంధ్ర కేసరి ప్రకాశం మున్సిపల్ హై స్కూల్ నందు చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత పదవుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారిలో కొందరు ఉపాధ్యాయ వృత్తి, రెవెన్యూ డిపార్ట్మెంట్, రైల్వే, మీడియా, పోస్టల్, వైద్య, వివిధ రంగాల్లో పలు వ్యాపారాలు తదితర స్థానాల్లో వారు ఉన్నత స్థితిలో ఉన్నారు. వీరంతా ఒక్కసారే కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు అక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులు వారి మనసులో మాట చెప్పుకొచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన వీరంతా ఆటపాటలతో సాయంత్రం వరకు సరదాగా గడిపారు. ఒకరినొకరు ఫోటోలు తీసుకుంటూ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.