పిఠాపురం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారీని అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ ధల్ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం పిఠాపురంలో వారు మాట్లాడుతూ జంతువుల కళేబరం నుంచి నెయ్యి తయారీ పిఠాపురం అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.