పల్నాడు జిల్లా : పోలింగ్ తర్వాత పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై పోలింగ్ రోజున మరియు ఆ తర్వాత రోజున జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. మా పోలీస్ వారు వెంటనే స్పందించి, ఆ సంఘటనలకు కారణమైన వారిని గుర్తించి, వారిపై తక్షణమే కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.
అంతే కాకుండా మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి మరియు ఇతర ప్రాంతాలలో స్థానిక పోలీస్ వారిని మరియు కేంద్ర బలగాలను మొహరింపజేయడం జరిగింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. 144 సెక్షన్ కట్టుదిట్టంగా అమలుపరుస్తూ పలు చోట్ల విస్తృత వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది.శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి సమస్య ఉత్పన్నమవకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగినది.
ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అన్ని చోట్ల ప్రశాంత వాతావరణం నెలకొంది.పరిస్థితులు అన్ని పోలీసుల అదుపులో ఉన్నాయి.ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ, మా పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతున్నది.
ఇంకా కొన్ని రోజులు 144 సెక్షన్ అమలులోనే వుంటుంది.
ఇప్పటివరకు మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాలలో జరిగిన అన్ని సంఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుల సత్వర దర్యాప్తుకై ప్రత్యేక దృష్టి సారించడం జరిగినది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిపై తీవ్రమైన చర్యలుఉంటాయి. ప్రజలందరూ సమయమనం పాటించి, ఎటువంటి ఉద్రేకతలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనే లాగా పోలీస్ వారికి సహకరించాలి.