పల్నాడు జిల్లా / పెదకూరపాడు : అదృశ్యమైన తన కుమార్తె ఆచూకీ తెలియక నాలుగు సంవత్సరాలుగా మనోవేదనతో బాధపడుతూ అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన పాడిబండ్ల రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని పెదకూరపాడు నియోజకవర్గం శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ చరవాణిలో కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రవీణ్ బ్రదర్ పాపారావు అత్తిమళ్ళ రమేష్ భౌతిక గాయా నికి నివాళులర్పించారు .గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ యనా సాంబశివరెడ్డి , జి డి సి సి బ్యాంక్ మాజీ డైరెక్టర్ నెలకుదుటి వెంకట వరప్రసాద్ భౌతికాయానికి నివాళులర్పించారు వీరి వెంట మండల పార్టీ నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు.