పల్నాడు జిల్లా/ పెద్దకూరపాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభలను నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన సభను సర్పంచ్ గుడిపూడి రాజు అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల వినియోగంపై గ్రామసభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు ,ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ,తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోందన్న ఎమ్మెల్యే ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని తెలిపారు. పల్లెసీమలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అన్న పూజ్య బాపూజీ అడుగుజాడల్లో రాష్ట్రం ముందడుగు వేసిందని, ఉపాధి హామీ పథకం పనులు నిర్థారించుకోవడంతో పాటు గ్రామాల్లోని రోడ్లు, త్రాగునీరు, మురుగునీటి పారుదల వంటి సమస్యల పై అందరూ చర్చించి పరిష్కరించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఎన్ని నిధులు ఇస్తోంది ?వాటితో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు వంటి అంశాలపై గ్రామ సభల్లో చర్చ జరుగుతుందని, గ్రామాల అభివృద్దితోనే రాష్ట్రాలు ఆ తర్వాత దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
స్వయం పాలిత ప్రాంతాలుగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సభల్లో పాల్గొని తమ తమ అవసరాలు చెప్పి వాటి పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు .రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలకు త్రాగు,సాగు నీరు అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి, జిల్లా డ్వామా పి.డి. జోసఫ్, మండలప్రత్యేక అధికారి ధనలక్ష్మి, ఏ. పీ. ఓ , కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి భాష్యం ఆంజనేయులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్తిమళ్ళ రమేష్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పార్టీ బండ్ల బాలయ్య, నియోజకవర్గ నాయకులు, వేమవరపు రాజారాం, మండల నాయకులు మక్కెన సాగర్ తదితరులు పాల్గొన్నారు.