మద్యానికి బానిసైన భర్త చేస్తున్న వేధింపులను తాళలేకపోయిన భార్య రోదన .. వివరాల్లోకి వెళితే .. పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామం జగన్ కాలని లో నివాసముంటున్న షేక్. షమీమున్నీ వికలాంగురాలు నడికుడికి చెందిన సైదా అనే అతన్ని వివాహం చేసుకుంది వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఈమె భర్త రోజూ తప్ప త్రాగి పిల్లలను భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టడం వారి దగ్గర ఉన్న బంగారం వెండి వస్తువులు బలవంతంగా తీసుకపోయి అమ్ముకొని మద్యం సేవిస్తూ ఉండే వాడని, ఐతే గత నాలుగు సంవత్సరాలుగా భార్య పిల్లలను విడిచిపెట్టి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చి అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో విచక్షణ రహితంగా క్రింద పడేసి తల పగులగొట్టి పారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తుంది . సంఘటన జరిగిన వెంటనే దయాల్ 100 కి , షి టీమ్ కి కాల్ చేసి అర్ధ రాత్రి గురజాల హస్పిటలకు వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చామని బాధితురాలి సమాచారం. కానీ ఇంతవరకు పోలీసువారు ఎటువంటి చర్యలు తీసుకోలోలేదని, నిందితుడిని అరెస్టు చెయ్యలేదని ఆరోపిస్తుంది. తనకి తన భర్త , భర్త తల్లి వారి నుండి ప్రాణి హాని ఉందని ఆందోళన చెందుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది.