కరీంనగర్ జిల్లా : చిగురుమామిడి మండలకేంద్రంలో ఆదివారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనం నత్తిన పెట్టుకొని గ్రామంలో ఉన్న పోచమ్మ తల్లి ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు, సోమవారం ఘట్టం కొండ, మంగళవారం ఎల్లమ్మ బోనాలు, బుధవారం ఎల్లమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం అధ్యక్షులు బండారుపల్లి చంద్రం గౌడ్ తెలిపారు. ఆదివారం పోచమ్మ బోనాలు కార్యక్రమంలో తాళ్లపల్లి రాములు,బురుగు రాజయ్య, స్థానికులు పాల్గొన్నారు.
