- రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉన్న సీఎం సొంత జిల్లాలో మద్యం విక్రయాల జోరు
- ప్రొద్దుటూరులో ఉన్న కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ల సమీపంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
- చోద్యం చూస్తున్న ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ , ఇతర శాఖలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న కొన్ని బార్ ఆండ్ రెస్టారెంట్లు సమీపంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండి సీజ్ చేసిన కూడా.. మద్యం విక్రయాలు చేస్తున్నారంటే వారికున్న పలుకుబడి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ..ఎన్నికల కోడ్ మాకు జాంతానై అంటూ కొందరు యజమానులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు…
ప్రముఖ వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరులో కూడా సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహణ ఎన్నికల అధికారులు , పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. అయితే మద్యం విక్రయాలు జరపడం వల్ల ఎన్నికలకు ఎక్కడైనా విఘాతం జరుగుతుందో ఏమోనన్న ముందస్తు ఆలోచనతో ప్రభుత్వం మూడు రోజులు ముందుగానే మద్యం దుకాణాలతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లను కూడా మూసివేశారు. ఈనెల 11 , 12 , 13 తేదీల్లో బార్ అండ్ రెస్టారెంట్లు తెరవకుండా అధికారులు సీజ్ చేసిన మద్యం బయట ఉచ్చలవిడిగా అమ్ముతున్నారు.. ఆదివారం రాత్రి ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులోని బద్రి పటాకుల అంగడి పక్కనే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.