కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులలో ఇతర వ్యక్తుల గురించి గానీ పార్టీలను రెచ్చగొట్టే కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రూప్ అడ్మిన్లు అందరూ మీ మీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని పై విధమైన చర్యలు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని లేనియెడల వాళ్లు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించి వస్తుందని గన్నేరువరం ఎస్సై చందా నరసింహ రావు తెలిపారు